telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మసీదు, మందిరాలను కూల్చుతున్న వారిపై కేసులు పెట్టాలి: షబ్బీర్

shabbir ali congress

తెలంగాణ సెక్రటేరియట్ కూల్చివేత పనులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సచివాలయ ప్రాంతంలోని దేవాలయం, మసీదులకు కూడా ధ్వంసం కావడంపై కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ స్పందించారు. సచివాలయంలో మసీదు, మందిరాన్ని కూల్చటాన్ని బ్లాక్ డేగా భావిస్తున్నామని అన్నారు. మసీదు, మందిరాలను కూల్చుతోన్న సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డిపై క్రిమినల్ కేసులు పెట్టాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు.

ప్రణాళికలో భాగంగానే మసీదు‌ను కూల్చటాన్ని ఎంపీ అసదుద్ధీన్ స్వాగతించారని తప్పుబట్టారు. సొంత దుకాణాలను నడుపుకోవటానికి మతం పేరుతో వేలమంది ప్రాణాలను బలితీసుకున్న చరిత్ర ఎంఐఎం, బీజేపీదేనని ఆరోపించారు. నల్లపోచమ్మ దేవాలయం టీఆర్ఎస్, బీజేపీలకే సొంతం కాదన్నారు. మాజీ సీఎం వైఎస్ఆర్‌తో మాట్లాడి సచివాలయంలో మసీదును తానే నిర్మించానని గుర్తుచేశారు. సచివాలయానికి రాని సీఎం కేసీఆర్‌కు కొత్త సచివాలయం ఎందుక ని షబ్బీర్ ప్రశ్నించారు.

Related posts