కేసీఆర్ కుటుంబ సభ్యుల మధ్య పదవి చిచ్చు మొదలైందని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. తాజాగా హైదరాబాద్ కర్మన్ ఘాట్ లో మీడియాతో మాట్లాడిన ఆయన కేటీఆర్ సీఎం పదవిని ఆశిస్తున్నారని, వెంటనే ఆయనకు పదవిని ఇవ్వకుంటే ఏదైనా జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కేసీఆర్ ప్రాణాలకు ముప్పు ఉందని, ఆయనకు అనుక్షణం భద్రత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
కేటీఆర్ ను ప్రగతి భవన్ నుంచి వెంటనే ఖాళీ చేయించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయాలని, కేసీఆర్ ను దించి వేయాలని ఎర్రబెల్లి దయాకర్ వంటి నేతలు మాట్లాడుతున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వంలో ఏం జరుగుతోందో, టీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతోందో అర్థం చేసుకోవాలని అన్నారు.టీఆర్ఎస్ పార్టీలో భారీ చీలిక వచ్చిందని, కేసీఆర్ ఇంట్లో అర్థరాత్రి పూట ఏమైనా జరగవచ్చని, అల్లుడి నుంచి ముప్పు తగ్గిందని, కుమారుడు కేటీఆర్ నుంచి ఆయనకు ముప్పు ఉందని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
జగన్ గారూ మీరు ఏపీకి సీఎం.. సాక్షి పేపర్ చదవడం మానేయండి?: నారా లోకేశ్