telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ లో ఢిల్లీ పేరిట ఓ చెత్త రికార్డు…

ఐపీఎల్ లో ఎప్పుడు చివర్లో ఉండే జట్టు ఏది అంటే చాలా మంది ఢిల్లీ పేరే చెప్తారు. ఎందుకంటే ఇప్పటివరకు జరిగిన సీజన్లలో ఆ జట్టు ప్రదర్శన అలా ఉండేది. కానీ ఈ ఏడాది యూఏఈ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2020 లో ఈ యువ జట్టు పూర్తిగా మారిపోయింది. ఇప్పటివరకు ఈ ఐపీఎల్ 13వ సీజన్ లో 7 మ్యాచ్ లు ఆడిన ఢిల్లీ ఐదు మ్యాచ్ లలో విజయం సాధించి రెండు ఓడిపోయింది. కానీ నిన్నటి ఓటమితో ఐపీఎల్ లో ఓ చెత్త రికార్డు నెలకొల్పింది ఈ జట్టు. మొత్తం ఐపీఎల్ టోర్నీలో ముంబై పై ఓటమితో 100 మ్యాచ్ లు ఓడిపోయిన రెండో జట్టుగా ఢిల్లీ నిలిచింది. మొదటి స్థానంలో ఈ ఏడాది ఐపీఎల్ లో వరుసగా ఐదు మ్యాచ్ లు ఓడిపోయిన పంజాబ్ ఉంది. అయితే ఢిల్లీ జట్టు ఇప్పటివరకు జరిగిన 12 సీజన్లలో ముడి సార్లు ప్లే ఆఫ్ కి అర్హత సాధించిన ప్రతిసారి మూడోస్థానంలోనే ఆగిపోయింది. అయితే ఎప్పుడు ఐపీఎల్ పాయింట్ల పట్టికలో చివర్లో ఉండే ఢిల్లీ ఈ ఏడాది మాత్రం రెండో స్థానం లో కొనసాగుతుంది. చూడాలి మరి ఆ స్థానాన్ని చివరి వరకు కొనసాగిస్తుందా.. లేదా అనేది.

Related posts