telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

తిరుపతి : … సర్వాంగ సుందరంగా … ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లు…

grand arrangements in tirumala for mukkoti yekadasi

తిరుమల ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. శ్రీవారి ఆలయంలో సోమవారం వేకువజామున వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభమై మంగళవారం అర్ధరాత్రి ఏకాంతసేవ వరకు(48 గంటల పాటు) కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి 11 గంటలకే ఏకాంతసేవ నిర్వహిస్తారు. అర్ధరాత్రి 12.30 గంటలకు తిరిగి ఆలయం తెరిచి తిరుప్పావై పాశురం పఠించాక దక్షిణ, ఉత్తర భాగంలోని వైకుంఠ ద్వారాలను శాస్త్రోక్తంగా తెరుస్తారు.

ఈ సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం కోసం వచ్చే భక్తులను నేటి ఉదయం నుంచి క్యూ లైన్లలోకి అనుమతించనున్నారు. లక్ష మంది భక్తులు క్యూ లైన్లు, షెడ్లలో వేచి ఉండేలా ఈ ఏడాది ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ అధికారులు చెప్పారు. సోమవారం ఉదయం ఒంటి గంటకు వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం కానుంది. నాలుగు గంటల పాటు విఐపిలను దర్శనానికి అనుమతించనుండగా, ఉదయం 5 గంటల నుంచి ఎల్లుండి(మంగళవారం) వైకుంఠ ద్వారాలను మూసేవరకు సర్వదర్శనం ద్వారా మహాలఘులో భక్తులను అనుమతించనున్నారు. మరోవైపు శ్రీవాణి ట్రస్ట్ కింద 5వేల టిక్కెట్లను టీటీడీ జారీ చేసింది. వీరిని సోమవారం ఉదయం 10 గంటలకు దర్శనానికి అనుమతించనున్నారు. కాగా, ఈ ఆదివారం నుంచి నాలుగు రోజుల పాటు శ్రీవారి ఆలయంలో జరిగే అన్ని అర్జిత సేవలతో పాటు ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.

Related posts