telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

కరోనా వ్యాక్సిన్‌పై డబ్ల్యూహెచ్ఓ సంచలన వ్యాఖ్యలు

Corona Virus Vaccine

కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు ముమ్మరంగా ప్రయోగాలు చేస్తున్న సంగతి తెలిసిందే. వ్యాక్సిన్ ట్రయల్స్ చివరి దశలో ఉన్నాయని, మరో రెండు మూడు నెలల్లో టీకా అందుబాటులోకి వస్తుందని పలు దేశాలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన వ్యాఖ్యలు చేసింది. వివిధ దేశాలు అభివృద్ధి చేస్తున్న టీకాలన్నీ ప్రస్తుతం ప్రయోగదశలోనే ఉన్నాయని తెలిపింది.

ఏ దేశం కూడా ఇప్పటి వరకు అడ్వాన్స్ ట్రయల్స్ నిర్వహించలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి మార్గరెట్ హ్యారిస్ పేర్కొన్నారు. కాబట్టి సంవత్సరం తర్వాత కానీ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని తేల్చి చెప్పారు. వ్యాక్సిన్ ట్రయల్స్ మూడో దశ సుదీర్ఘంగా ఉంటుందని పేర్కొంది. ఈ సమయంలో వ్యాక్సిన్ ఎంత వరకు రక్షణ ఇస్తుందన్న విషయాన్ని పరిశీలించాల్సి ఉంటుందన్నారు.

ఇప్పటి వరకు ప్రకటించిన ఏ వ్యాక్సిన్ సమర్థత కూడా 50 శాతం ఉందన్న స్పష్టమైన సంకేతాలు అందలేదని హ్యారిస్ పేర్కొన్నారు. డబ్ల్యూహెచ్ఓ వాదన ఇలా ఉంటే అమెరికా మాత్రం అక్టోబరు చివరి నాటికి వ్యాక్సిన్ సిద్ధమవుతుందని ప్రకటించింది.

Related posts