telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఫలించిన బుజ్జగింపులు.. మెత్తబడ్డ సబితాఇంద్రారెడ్డి?

Congress Revanth meet Sabhitha Indrareddy

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోం మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్ లో చేరనున్నారని జోరుగా ప్రచారం జరిగింది. కేటీఆర్, కవితతో పాటు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్‌తో సబిత, ఆమె కుమారుడు కార్తీక్ రెడ్డి భేటీ కావడంతో వాళ్లిద్దరూ టీఆర్ఎస్‌లో చేరబోతున్నారంటూ ఊహాగానాలు సాగాయి. దీనికి తోడు సబిత వైపు నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఆమె తన కుమారుడితో కలిసి టీఆర్ఎస్‌లో చేరడం ఖాయమైపోయిందని అంతా అనుకున్నారు.

ఈ క్రమంలో సబితను బుజ్జగించేందుకు స్వయంగా రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు. నిన్న రాత్రి సబితకు ఫోన్ చేసిన రాహుల్, పార్టీ మారాలన్న ఆలోచన వద్దని, వెంటనే తనను కలవాలని సూచించారు. దీంతో తన కుమారుడు కార్తీక్ రెడ్డితో కలిసి సబిత నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. అంతకుముందు ఆమె పార్టీ మారకుండా రేవంత్ రెడ్డి చేసిన రాయబారం ఫలించింది. సబితతో రేవంత్ మాట్లాడటంతో ఆమె మనసు మార్చుకున్నట్టు సమాచారం. పార్టీ మారితే జరిగే పరిణామాలను వివరించగా ఆమె మెత్తబడ్డట్టు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్‌లోనే కొనసాగితే ఎలా ఉంటుందనే ఆలోచనకు సబిత వచ్చినట్టు తెలుస్తోంది.

Related posts