ఏపీలో శిరోముండనం ఘటనలు కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా దళితుల దాడులపై టీడీపీ అధినేత నేత చంద్రబాబు ఘాటుగా స్పందించారు.
విశాఖ జిల్లా టీడీపీ నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులపై దాడులను జగన్ ఎందుకు ఖండించడం లేదు? అని ప్రశ్నించారు.
విశాఖలో దళితుడి భూఆక్రమణను చంద్రబాబు ఖండించారు. సీఎం జగన్ అండ ఉందనే నేరగాళ్ల కళ్లు నెత్తికెక్కాయని అన్నారు. దళితులపై దాడులు జరగని రోజు లేదనిఅన్నారు.
తొలిదాడి జరిగినప్పుడే కఠినంగా శిక్షిస్తే వరుస దాడులు జరిగేవా? అని ప్రశించారు.
దళితులపై దాడిచేసి వీడియో తీయడం ఉన్మాద చర్య అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.