telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

మొదలైన ఎఫ్3 షూటింగ్…

గత ఏడాది సంక్రాంతికి వచ్చిన ఎఫ్2 సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ తీయాలని దర్శకుడు అనిల్ రావిపుడి అనుకుని లాక్‌డౌన్ సమయంలో ఓ కథను సిద్దం చేశాడు. అయితే ఎఫ్2 సినిమాకు దిల్ రాజు నిర్మాత బాధ్యతలు తీసుకున్నాడు. ఇప్పుడు ఎఫ్3 కథ నచ్చడంతో ఈ సినిమాను కూడా తానే నిర్మాస్తానని తెలిపాడు. ఇందులో చేసేందుకు ప్రధాన నటులు వెంకటేష్, వరుణ్ తేజ్‌లు కూడా ఆసక్తి చూపారు. అయితే ఈ సినిమా కుటుంబం వల్ల వచ్చే ఫ్రస్ట్లరేషన్, ఫన్ గురించి కాదని, ఇందులో ఫన్‌కు వేరే కారణాలు ఉంటాయని అనిల్ ముందే తెలిపాడు. ఎఫ్3ను ఎఫ్2తో పోలీస్తే కథ పూర్తి వేరుగా ఉంటుందని తెలిపారు. అయితే నేడు ఎఫ్3 హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో నామమాత్రంగా షూటింగ్‌ను మొదలు చేశారు. అసలు పూర్తి షూటింగ్ ఈ నెల 23నుంచి ప్రారంభం కానుందని తెలిపారు. ఈ ఫోటోలను చిత్ర యూనిట్ షేర్ చేసింది. మరి ఈ సినిమాలో ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ ఏ రేంజ్‌లో చూపిస్తారని ప్రేక్షకులు ఉవ్విలూరుతున్నారు. ఈ సినిమాపై భారీగా అంచనాలను పెట్టుకున్నారు.

Related posts