telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

ఢిల్లీలో తగ్గిన ఉల్లి ఘాటు..కిలో 23 రూపాయలకే!

kejriwal on his campaign in ap

ఉల్లి ధర ఆకాశాన్నంటిన నేపథ్యంలో ఢిల్లీ వాసులకు ప్రభుత్వం ఊరట కల్పించింది. మార్కెట్‌ రేటుతో పోలిస్తే సగానికే ఉల్లిని అందించే ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 28 నుంచి కిలో ఉల్లిపాయలను రూ.23.90కే విక్రయించనున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు.

రాష్ట్రంలోని 400 రేషన్‌ షాపులతోపాటు 70 మొబైల్‌ వ్యాన్‌ల ద్వారా ఉల్లిని ప్రజలకు అందించనున్నట్లు తెలిపారు. దీనికోసం రానున్న 5 రోజుల్లో కేంద్రం నుంచి సుమారు లక్ష కిలోల ఉల్లిపాయలను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయనున్నట్లు పేర్కొన్నారు. అయితే కొన్ని పరిమితులతో మాత్రమే వీటిని కొనుగోలు చేయగలరు. ఒక వ్యక్తికి ఒకసారి కేవలం 5 కిలోల ఉల్లిపాయలను మాత్రమే విక్రయించనున్నట్లు చెప్పారు.

Related posts