telugu navyamedia
రాజకీయ వార్తలు

రెండు మిలియన్ల వ్యాక్సిన్లు సిద్దం: డొనాల్డ్ ట్రంప్

trump usa

వ్యాక్సిన్లు కనుగొనడంలో అమెరికా పనితీరు తిరుగులేని విధంగా ఉందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. కరోనాపై నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే రెడ్ను మిలియన్ల డోసుల మేర వ్యాక్సిన్లు సిద్ధమయ్యాయని తెలిపారు. అయితే అవి సురక్షితమేనని, ప్రభావవంతమైనవని శాస్త్రవేత్తలు తేల్చాల్సి ఉందని పేర్కొన్నారు. ఆ తర్వాతే వాటిని ముందుకు తీసుకెళతామని వెల్లడించారు.

వ్యాక్సిన్ల పరిశోధనలో మహాద్భుతమైన పురోగతి కనిపించిందని చెప్పారు.నిన్న వ్యాక్సిన్ల అంశం మీద సమావేశం నిర్వహించామని అన్నారు. త్వరలోనే అందరూ ఆశ్చర్యం కలిగించే విషయాలు వినబోతున్నారని అన్నారు. బహుశా అది చికిత్స పరమైన అంశాలు కావొచ్చని, అమోఘమైన ఫలితాలు వస్తున్నాయని సెలవిచ్చారు.

Related posts