telugu navyamedia
రాజకీయ వార్తలు

పుల్వామా ఘటన విచారణలో ఏం తేల్చారు?: కేంద్రాన్ని ప్రశ్నించిన రాహుల్‌

rahul gandhi to ap on 31st

శ్రీనగర్‌ జాతీయ రహదారిపై 2019 ఫిబ్రవరి 14న భారత జవాన్లను తీసుకువెళ్తున్న కాన్వాయ్‌పై పుల్వామా వద్ద కారుతో ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో సీఆర్‌పీఎఫ్‌కు చెందిన 40 మంది జవాన్లు మరణించారు. 35 మంది జవాన్లు గాయపడ్డారు. ఈ ఘటనపై కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌గాంధీ కేంద్రానికి ప్రశ్నలు సందించారు.

ట్విట్టర్‌ వేదికగా రాహుల్‌ ప్రశ్నించారు. 40 మంది జవాన్లు బలిగొన్న పుల్వామా దాడి వల్ల ఎవరు లాభ పడ్డారు?. విచారణలో ఇప్పటి వరకు ఏం తేల్చారు?. భద్రతా వైఫల్యానికి బీజేపీ ప్రభుత్వంలో ఎవరు బాధ్యత వహిస్తారు? అని ఆయన ప్రశ్నించారు. దాడి ఘటన జరిగి ఏడాది కావొస్తున్నా ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఏం చర్యలు చేపట్టిందో వెల్లడించాలని రాహుల్‌ ప్రశ్నించారు.

Related posts