*బెంగాల్ మంత్రి పార్థా ఛటర్జీపై వేటు
*మంత్రి పదవి నుంచి తొలగించిన సీఎం మమతా బెనర్జీ
*టీచర్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌లో ఛటర్జీ అరెస్ట్
టీచర్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి పార్థా ఛటర్జీకీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ షాకిచ్చారు. ఆయనను మంత్రి పదవి నుంచి తొలగిస్తూ వేటు వేశారు. ఈ మేరకు బంగాల్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది
ప్రస్తుతం ఆయన వాణిజ్యం, పరిశ్రమల శాఖ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ అండ్ ఇండస్ట్రియల్ రికన్‌స్ట్రక్షన్ మంత్రిగా ఉన్నారు. టీఎంసీ ప్రధాన కార్యదర్శిగానూ కొనసాగుతున్నారు.
కాగా..బర్తరఫ్ చేయాలంటూ ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ఆందోళనలకు దిగిన నేపధ్యంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ నిర్ణయం తీసుకున్నారు.
కాగా,..స్కూల్ సర్వీస్ కమిషన్‌లో టీచర్ రిక్రూట్‌మెంట్ విషయంలో అక్రమాలకు పాల్పడిన కేసులో మంత్రి పార్థ ఛటర్జీని అరెస్ట్ చేశారు. ఆయన సన్నిహితురాలు అర్పిత ముఖర్జీని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే అర్పిత ముఖర్జీ ఇంట్లో సోదాలు నిర్వహించిన ఈడీ, రూ.20 కోట్లు స్వాధీనం చేసుకుంది. పార్థ ఛటర్జీ ఇతర సన్నిహితులందరి ఇళ్లపైనా ఈడీ దాడులు చేస్తోంది. ఛటర్జీ విద్యాశాఖా మంత్రిగా ఉన్న సమయంలో సెక్రటరీగా ఉన్న సుకాంత అచర్జీతో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న చందన్ మొండల్ ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు.
టీచర్ ఉద్యోగం ఇస్తామని పెద్ద మొత్తంలో చందన్ పలువురి నుంచి డబ్బులు తీసుకున్నట్టు ఆరోపణలున్నాయి. వీరితో పాటు స్కూల్ సర్వీస్ కమిషన్‌లోని ఐదుగురు సభ్యుల కమిటీ కన్వీనర్ ఇంట్లోనూ రెయిడ్ జరిగింది. ఈ అందరి ఇళ్ల నుంచి కొన్ని డాక్యుమెంట్లు, రికార్డులు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఫారిన్ కరెన్సీని రికవరీ చేసినట్టు ఈడీ అధికారులు వెల్లడించారు. అర్పిత ముఖర్జీకి చెందిన మరో ఇంట్లో సోదాలు చేసిన ఈడీ, రూ.29 కోట్లను స్వాధీనం చేసుకుంది.