telugu navyamedia
తెలంగాణ వార్తలు

యశ్వంత్‌సిన్హా ఉన్నత వ్యక్తిత్వం కలిగిన వ్య‌క్తి.. గెలుస్తారనే నమ్మకం ఉంది..

రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థులను బేరీజు వేసుకుని నిర్ణయం తీసుకుని ఓటు వేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రతిపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాను సాదరంగా స్వాగతించిన ఆయన జలవిహార్‌లో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు.

ఈ నేపథ్యంలో జరిగిన సభలో కేసీఆర్​ మాట్లాడుతూ.. ఉత్తమ, ఉన్నతమైన వ్యక్తి రాష్ట్రపతిగా ఉంటే దేశ ప్రతిష్ఠ మరింత ఇనుమడిస్తుందని తెలిపారు. దేశంలో గుణాత్మక మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. 

యశ్వంత్‌ సిన్హాకు తెలంగాణ ప్రజలు, ప్రభుత్వం తరపున హైదరాబాద్‌కు హృదయపూర్వక స్వాగతం పలికారు. భారత రాజకీయాల్లో యశ్వంత్‌సిన్హా ఉన్నత వ్యక్తిత్వం కలిగిన వ్య‌క్తి అని కొనియాడారు. . న్యాయవాదిగా ఆయన తన ప్రస్థానం మొదలుపెట్టి.. అధికారిగా ఆపై రాజకీయ వేత్తగా ఎదిగారు. అధికారిగా, రాజనీతిజ్ఞుడిగా తనను తాను నిరూపించుకున్నారు.

తన పనితీరుతో అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్నారు. దేశంలో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరం ఉంది. అందుకే.. పార్లమెంటేరి నేత‌లంతా ఆత్మ ప్రభోదానుసారం యశ్వంత్‌ సిన్హాకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు సీఎం కేసీఆర్‌.

రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్‌ లాంటి మంచి నేతను ఎన్నుకోవడం అదృష్టం.. సమున్నత వ్యక్తిత్వం ఉన్న యశ్వంత్‌ సిన్హా గెలుస్తారనే నమ్మకం ఉంది. ఆయన గెలవాలని మనసారా కోరుకుంటున్నట్లు.. తద్వారా దేశ గౌరవం రెట్టింపు అవుతుందని పేర్కొన్నారు.

Related posts