telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు సినిమా వార్తలు

బిగ్‌బాస్‌ బ్యూటీకి షాకిచ్చిన తెలంగాణ ప్రభుత్వం !

బిగ్‌బాస్‌ బ్యూటీ దేత్తడి హారికకు తెలంగాణ ప్రభుత్వం షాకిచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా హారికను నియమిచండపై పెద్ద దుమారమే రేగుతోంది. మహిళ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా బిగ్ బాస్ లో పాల్గొన్న హారికను టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా నియమించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్, cmo అధికారులకు తెలవకుండా హరికను నియమించారు ఉప్పల శ్రీనివాస్ గుప్తా. దీంతో ఉప్పల శ్రీనివాస్ గుప్తాను మందలించారు సీఎంఓ అధికారులు. అంతేకాదు… హారిక వివరాలను టూరిజం శాఖ వెబ్సైట్ నుంచి తొలగించారు అధికారులు. ఇప్పుడు ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియామకం చేసిన తర్వాత.. ఇలా వివరాలను తొలగించడంపై కొందరు రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా ఖండించారు.

Related posts