telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

కరోనా సెకండ్ వేవ్ పై మంత్రి ఈటల సంచలన వ్యాఖ్యలు…

ప్రపంచాన్ని కరీనా వణికిస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం మన తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్… కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కోవిడ్‌ ఫస్ట్ వేవ్‌తో ప్రమాదం ఏమీ లేదు.. కానీ, సెకండ్ వేవ్ ప్రమాదకరంగా ఉందని హెచ్చరించారు.. ఇక, ఎలాంటి విపత్కర పరిస్థితులను అయినా ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేసిన మంత్రి.. ప్రస్తుతం రాష్ట్రంలో ఇతర దేశాల నుండి వచ్చిన వారిని ట్రెస్ చేయగా కొంతమందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని తెలిపారు.. అయితే, అది కొత్త స్ట్రెయిన్ కరోనా? లేక పాత కరోనా? అనేది ఇంకా నిర్దారణ కావడానికి కొంత సమయం పడుతుందన్నారు ఈటల.. అయితే, ప్రస్తుత పరిస్థితులను చూస్తే పెద్ద ప్రమాదంగానే ఉందని హెచ్చరించిన ఆయన.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మరీ మరీ విజ్ఞప్తి చేశారు. కాగా, ఈ నెలలో యూకే నుంచి, యూకే మీదుగా 1200 మంది రాష్ట్రానికి వచ్చినట్టు తేల్చిన అధికారులు.. అందరినీ గుర్తించేపనిలో పడ్డారు. ఇప్పటికే కొంత మందికి పాజిటివ్‌గా తేలగా.. వారితో సన్నిహితంగా ఉన్నవాళ్లను కూడా హోం క్వారంటైన్‌లో ఉంచి పర్యవేక్షిస్తున్నారు.

Related posts