హుజూర్ నగర్ నియోజకవర్గం పై తెలంగాణ సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. నియోజకవర్గ ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. శనివారం హుజూర్‌నగర్‌లో కేసీఆర్ ప్రజా కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన హుజూర్‌నగర్‌పై వరాల వాన కురిపించారు.
నియోజకవర్గంలో సీఎం ప్రత్యేక నిధి నుంచి హుజూర్నగర్ నియోజకవర్గంలో రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేస్తాం. నియోజకవర్గంలో బంజారాభవన్‌ను కూడా నిర్మిస్తాం. హుజూర్నగర్, మిర్యాలగూడ, నాగార్జునసాగర్‌లో పోడుభూముల సమస్యను పరిష్కరిస్తాం. హుజూర్‌నగర్‌కు రెవెన్యూ డివిజన్ మంజూరు చేస్తాం. ఈఎస్ఐ ఆస్పత్రి, పాలిటెక్నిక్ కాలేజీని ఏర్పాటు చేస్తాం. హుజూర్‌నగర్‌లో కోర్టును కూడా ఏర్పాటు చేస్తాం. భారీగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేస్తామని అన్నారు.
కేసీఆర్ కుర్చి పోయే కాలం వచ్చింది: కోమటిరెడ్డి