telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

చంద్రబాబు అధ్యక్షతన 15 శాతం వృద్ధి రేటు లక్ష్యంగా విజన్-2047 టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం

స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్-2047పై సచివాలయంలో పారిశ్రామిక వేత్తలతో ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చంద్రశేఖరన్, సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ, జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ జీ.ఎం రావు, ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఎస్.ఎన్ సుబ్రహ్మణ్యన్, టీవీఎస్ కంపెనీ చైర్మన్ వేణు శ్రీనివాసన్, అపోలో ప్రతినిధి ప్రీతారెడ్డి, పిరమాల్ గ్రూప్ చైర్మన్ అజయ్ పిరమాల్, రెడ్డీ ల్యాబరేటరీస్ చైర్మన్ సతీష్ రెడ్డితో పాటు పలు ప్రఖ్యాత కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్ గా సీఎం చంద్రబాబు, కో ఛైర్మన్ గా టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ ఉన్నారు. సచివాలయంలో టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశానికి రాష్ట్ర మంత్రులు, సీఐఐ ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పారిశ్రామిక రంగ ప్రముఖులు హాజరయ్యారు. విజన్-2047పై ప్రభుత్వ ఆలోచనలు, పాలసీలను చంద్రబాబు వారితో పంచుకున్నారు..

ఇప్పుడు టెక్నాలజీ మరింత అడ్వాన్స్డ్ గా ఉంది. దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. యువతకు అవకాశాలు కల్పిస్తే తిరుగులేని ఫలితాలు వస్తాయి. ఏపీలో సహజ వనరులు, మానవ వనరులు, మౌళిక సదుపాయాలు, హైవేలు, ఎయిర్ పోర్టులు ఉన్నాయి.

కొత్త ఆవిష్కరణలకు, కొత్త ఆలోచనలకు మేం వేదికగా ఉండాలి అనుకుంటున్నాం. నాడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడాం ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడుతున్నాం” అని సీఎం అన్నారు.

అవకాశాల కల్పనతో సంపద సృష్టి సాధ్యం అవుతుందని  తద్వారా వచ్చిన సంపదను పేద వర్గాలకు పంచి ప్రజల జీవన ప్రమాణాలు పెంచవచ్చని తెలిపారు.

 

Related posts