telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

అమెరికాలో .. మేయర్ గా మేక ఎంపిక.. ! ఏడాది పాటు పదవిలో..

goat elected as mayor in america

అగ్రరాజ్యంలో వింతలు, విశేషాలకు కొదవ ఉండదు. అక్కడ టీనేజర్లను సైతం మేయర్లుగా ఎన్నుకుంటూ ఉంటారు. తాజాగా మసాచుసెట్స్ లోని ఫెయిర్ హెవెన్ టౌన్ లో మరో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఈ నగరానికి మేయర్ గా మూడేళ్ల వయసున్న లింకన్ అనే బుజ్జి మేక ఎన్నికయింది. శామీ అనే కుక్కపై పోటీచేసిన లింకన్ 3 ఓట్ల తేడాతో విజయం సాధించింది. అంతేకాకుండా నగర కౌన్సిల్ కు మరో 15 జంతువులు కూడా ఎన్నికయ్యాయి.

లింకన్ ఫెయిల్ హెవెన్ కు ఏడాది కాలం పాటు మేయర్ గా వ్యవహరించనుంది. ఈ విషయమై టౌన్ మేనేజర్ జో గంటర్ మాట్లాడుతూ.. పట్టణంలోని స్కూలు మైదానాన్ని అభివృద్ధి చేసేందుకు నిధుల కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. దీనివల్ల పిల్లలకు ఓటు హక్కు విలువ తెలిసిందని వ్యాఖ్యానించారు. మేయర్ గా మేక ఎన్నిక కావడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

Related posts