telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సోమవారం హాస్పిటల్ నుంచి ఎస్పీ బాలు డిశ్చార్జ్…?

SPB

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం హాస్పిటల్‌లో జాయిన్ అయినప్పటి నుంచి ప్రతి రోజూ ఆరోగ్య పరిస్థితిని చెబుతూ ఆయన తనయుడు ఎస్పీ చరణ్ వీడియోను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన విడుదల చేసిన వీడియోలో వరుసగా నాలుగో రోజు తన తండ్రి ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆయన నిదానంగా కోలుకుంటున్నారని తెలిపారు. దేవుని ఆశీర్వాదంతో సోమవారం ఓ శుభవార్త వినబోతున్నారని చరణ్ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ట్విట్టర్‌లో చరణ్‌ స్పందించారు. దీంతో గాన గంధర్వుడు సోమవారం డిశ్చార్జ్ కాబోతున్నారని సినీ వర్గాలవారు, బాలు అభిమానులు భావిస్తున్నారు. మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా గాన గంధర్వుడు ఎస్పీ బాలు కోసం అభిమానులు, సంగీత కళాకారులు చేసిన పూజలు ఫలించి కోవిడ్-19తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలు ఆరోగ్యం ప్రస్తుతం మెరుగైంది.

Related posts