telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

టాలీవుడ్ కి .. మరో మలయాళ నటి..

another malayali actress to tollywood

తెలుగు సినీ పరిశ్రమకు మ‌ల‌యాళ భామ‌లు పరిచయం కావడం కొత్తేమి కాదు. గ‌తంలో ఆసిన్‌, న‌య‌న‌తార‌, ప్రియ‌మ‌ణి వంటి వారు ఓ ఊపు ఊపితే ప్ర‌స్తుతం నిత్యామీన‌న్, కీర్తి సురేష్‌, అనుప‌మ‌, నివేదా థామ‌స్‌, ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ త‌దిత‌రులు తెలుగు ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లో మ‌రో మ‌ల‌యాళ భామ చేరింది. అన‌ఘ అనే న‌టి `ఆర్.ఎక్స్.100` ఫేమ్ కార్తికేయ స‌ర‌స‌న `గుణ 369`లో జోడీ క‌డుతున్నారు. ఇందులో గీత అనే పాత్ర‌లో ఆమె న‌టించింది.

త‌మిళ చిత్రం `న‌ట్పే తునై`లో అన‌ఘ న‌టించింది. అందులోని ఆమె న‌ట‌న న‌చ్చి ఈ చిత్రానికి ఎంపిక చేసిన‌ట్టు నిర్మాతలు తెలిపారు. స్ప్రింట్‌ ఫిలిమ్స్‌, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌జీ మూవీ మేక‌ర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం `గుణ 369`. అనిల్‌ కడియాల, తిరుమల్‌ రెడ్డి నిర్మాతలు. అర్జున్‌ జంధ్యాల ఈ చిత్రంతో దర్శకుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే విడుద‌ల తేదీని ప్ర‌క‌టిస్తాం“ అని చెప్పారు. ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు.

Related posts