ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ఎన్టీఆర్, పీవీ సమాధులను కూలిస్తా అన్నాడట ఓవైసీ.. దమ్ముంటే కూల్చరా… నీ దారుసలేం భవనాన్ని క్షణాల్లో కొల్చేస్తారు మా కార్యకర్తలు అంటూ సవాల్ విసిరారు బండి సంజయ్. ఢిల్లీ పార్టీ బీజేపీ అని ఒకడు అంటున్నాడు… మీది గల్లీ పార్టీ.. గడీల పార్టీ అని బండి సంజయ్ అన్నారు. ఢిల్లీ పార్టీ అయినా… గల్లీ గల్లీకి ప్రధాన మంత్రి పథకాలు చేరువయ్యాయని సవాల్ చేస్తున్న… నిజంగా మీది లోకల్ పార్టీ అయితే… కేంద్ర ప్రభుత్వ నిధులు లేకుండా ఏం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దొంగ సంతకం పెట్టి.. 10 వేల పంపిణీని అడ్డుకున్న పాస్పోర్ట్ బ్రోకర్ కేసీఆర్ అని.. Lrs పోవాలంటే.. trs పోవాలన్నారు. Trs పోవాలంటే బీజేపీ రావాలని.. ప్రతీపైసా కేంద్రం ఇస్తోందని పేర్కొన్నారు. పేర్లు మార్చి, ఫోటోలు మార్చి.. తన పథకాలుగా చెప్పుకుంటున్నాడని ఫైర్ అయ్యారు. ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ జరిగితే.. పాకిస్తాన్ గెలవాలి అన్నోడిని తరిమికొట్టాలా లేదా అని ప్రశ్నించారు. ఓల్డ్ సిటీలో పాకిస్థాన్ వాళ్ళందరిని తరిమి కొట్టాలా లేదా…Mim పార్టీ అంటే సీఎం కి ఉచ్చ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
previous post
డ్రగ్స్ చాపకింద నీరులా విస్తరిస్తోంది..