telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నవంబర్ లో తెలుగులో బాండ్ 25వ చిత్రం “నో టైమ్ టు డై”

No-Time

“జేమ్స్ బాండ్” చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. తాజాగా బాండ్ సీరీస్ లో వస్తున్న 25వ చిత్రం “నో టైమ్ టు డై”. బాండ్ పాత్రలో డేనియల్ క్రేగ్ నటించిన ఈ చిత్రానికి క్యారీ జోజీ దర్శకత్వం వహించాడు. గత కొన్నాళ్లుగా మానవాళిని అతలాకుతలం చేస్తున్న మహమ్మారి కరోనా లాంటి ఒక వైరస్ ప్రపంచం మీద దాడి చేయడం.. ప్రజలు హాహాకారాలు చేస్తూ భీతిల్లడం.. ఆ మహమ్మారి కోరల నుంచి ప్రజలను రక్షించడం కోసం బాండ్ రంగంలోకి దిగడం, వంటి ఆసక్తికర కథాంశంతో దీనిని తెరకెక్కించారు. ఇప్పుడీ చిత్రాన్ని తెలుగు సహా ఇతర భారతీయ భాషల్లోకి కూడా అనువదించారు. తెలుగులో కూడా “నో టైమ్ టు డై” టైటిల్ తో రిలీజ్ చేయనున్నారు. వాస్తవానికి ఏప్రిల్ నెలలోనే విడుదల కావలసిన ఈ చిత్రం కరోనా నేపథ్యంలో వాయిదా పడింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని అన్ని భాషల్లోనూ ఒకేసారి నవంబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్రబృందం.

Related posts