telugu navyamedia
సినిమా వార్తలు

“పహిల్వాన్” ట్రైలర్… గెలుస్తానో లేదో కానీ… ఓటమిని మాత్రం ఒప్పుకోను

Pehlwan

కన్నడ నటుడు కిచ్చ సుదీప్ ప్ర‌స్తుతం ఎస్‌.కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో “ప‌హిల్వాన్” చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తెలుగులో “ప‌హిల్వాన్” అనే టైటిల్ తో విడుద‌ల కానుంది. ఆ మ‌ధ్య మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయించారు. తాజాగా చిత్ర ట్రైల‌ర్ విడుద‌లైంది. ఇందులోని స‌న్నివేశాలు సినిమాపై ఆస‌క్తిని క‌లిగిస్తున్నాయి. “బ‌లం ఉంద‌నే అహంతో కొట్టేవాడు రౌడీ… బ‌ల‌మైన కార‌ణం కోసం కొట్టేవాడు యోధుడు” అనే డైలాగ్ ఆక‌ట్టుకుంటుంది. సెప్టెంబ‌ర్ 12న చిత్రం విడుద‌ల కానుంది. సుదీప్ తెలుగులో ఈగ‌, బాహుబ‌లి వంటి చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. తాజాగా విడుద‌లైన ఈ పవర్ ఫుల్ ట్రైల‌ర్‌ ను మీరు కూడా వీక్షించండి.

స్వప్న కృష్ణ పహిల్వాన్‌ నేతృత్వంలో నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రంలో కిచ్చ సుదీప్‌ పహిల్వాన్‌గా కనిపించబోతున్నారు. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి ఈ చిత్రంలో కీల‌క పాత్ర పోషిస్తున్నారు. తొలిసారిగా సుదీప్‌ ఈ సినిమాలో కుస్తీ వీరునిగా, బాక్సర్‌గా అభిమానులను అలరించబోతున్నారు. ఆకాంక్ష సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో కబీర్‌ దుహాన్‌సింగ్‌ విలన్ పాత్రలో కనిపించనున్నారు. స్టంట్స్‌ కోసం హాలీవుడ్‌ నుంచి లార్వెన్‌ సోహైల్‌ అనే నిపుణున్ని కూడా పిలిపించారు. అర్జున్ జ‌న్యా సంగీతం అందిస్తున్నారు.

Related posts