కడప వైసీపీలో అసంతృప్తి, జమ్మలమడుగులో స్వతంత్ర అభ్యర్థి అల్లె ప్రభావతి ఇంటింటి కార్యక్రమంలో భాగంగా నగర పంచాయతీ పరిధిలోని భాగ్యనగర్ కాలనీలో ఇంటింటికి కార్యక్రమాన్ని నిర్వహించారు. అల్లె నిర్వహించిన ప్రచారంలో క్లాస్-1 కాంట్రాక్టర్ ఏసీ చెన్నారెడ్డి, బ్రహ్మం, చిన్నకొమెర్ల స్వప్న, జయశ్రీ, నాగలక్ష్మి, రాములమ్మ, లావణ్య తదితరులు పాల్గొన్నారు.
జమ్మలమడుగు వైసీపీ టికెట్ అల్లె ఆశించారు.. అయితే అప్పటికే సుధీర్ రెడ్డిని అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించింది. అప్పట్లో ఖచ్చితంగా పార్టీలో సముచిత స్థానం ఇస్తామని వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి.. అల్లెకు హామీ ఇచ్చారు. అయితే ఆ మరుసటి రోజే ఆమె పార్టీకి రాజీనామా చేసి ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు.
చంద్రబాబు, జగన్ దొందూ దొందే: సీపీఐ నారాయణ