telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం జగన్

cm jagan ycp

ఏపీ సీఎం జగన్ రైతు భరోసా కార్యక్రమాన్నిఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా అన్నదాతలకు సాయం అందించేలా నిధులను విడుదల చేశారు. అనంతరం రైతులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో పలు జిల్లాలకు చెందిన రైతులు పాల్గొన్నారు. రైతు కుటుంబాలకు తొలి విడత రూ.7,500 సాయం అందిస్తున్నామని సీఎం ప్రకటించారు. వరుసగా రెండో ఏడాది అన్నదాతలకు సాయం చేస్తున్నామన్నారు. వైఎస్సార్‌ రైతు భరోసా ద్వారా 49.43 లక్షల రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరనుందని జగన్‌ తెలిపారు.

2021 చివరికల్లా ప్రతి గ్రామ సచివాలయం పక్కన వైఎస్సార్ జనతా బజార్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. రైతులు పండించే ప్రతి పంటను అమ్ముకునేందుకు వైఎస్సార్ జనతా బజార్లు ఉపయుక్తంగా ఉంటాయని వివరించారు. వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలకు రైతులు కష్టపడకుండా వైఎస్సార్ జనతా బజార్లు సరైన వేదికలుగా నిలుస్తాయని తెలిపారు. గ్రామ స్థాయిలోనే కోల్డ్ స్టోరేజి సదుపాయం కల్పించే స్థాయికి అభివృద్ధి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. త్వరలో రాష్ట్ర, జిల్లా స్థాయిలో వ్యవసాయ బోర్డులు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు

Related posts