telugu navyamedia
క్రైమ్ వార్తలు

మహిళ కిడ్నాప్, అత్యాచారం కేసు : రిమాండ్​ రిపోర్టులో విస్తుపోయే నిజాలు

మహిళ కిడ్నాప్, అత్యాచారం కేసులో అరెస్ట్ అయిన మారేడ్‌పల్లి సీఐ నాగేశ్వరరావు నుంచి పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. నాగేశ్వరరావు రిమాండ్ రిపోర్టులో విస్తుపోయే నిజాలువెలుగు చూశాయి .

దర్యాప్తులో నాగేశ్వరరావు నేరాన్ని ఒప్పుకున్నట్లు వనస్థలిపురం ఏసీపీ పేర్కొన్నారు. ఈ కేసు రిమాండ్‌ రిపోర్టులో విస్తుపోయే అంశాలను పోలీసులు వెల్లడించారు. అత్యాచారం, అపహరణ కేసు నమోదు చేసిన పోలీసులు కీలక ఆధారాలు సేకరించిన్నట్లు పేర్కొన్నారు.

నాగేశ్వరరావు టాస్క్‌ఫోర్స్‌లో వున్న సమయంలోనే బాధిత మహిళపై కన్ను వేసినట్లుగా తెలుస్తోంది. భర్తను కలిసేందుకు టాస్క్‌ఫోర్స్‌ ఆఫీసుకు వచ్చినప్పటి నుంచి బాధితురాలిపై నాగేశ్వరరావు కన్నేసినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి ఆమె వాంగ్మూలం రికార్డు చేశారు.బాధితురాలిపై అత్యాచారం జరిగిన గదిలో వెంట్రుకలు, దుప్పటి, గాజులు క్లూస్‌ టీమ్‌ స్వాధీనం చేసుకుంది. నాగేశ్వరరావును బాధితురాలి భర్త కొట్టిన కర్ర, అత్యాచార సమయంలో బాధితురాలి దుస్తులు స్వాధీనం చేసుకుని వాటిని ఎఫ్ఎస్‌ఎల్‌కి పంపించినట్టు పోలీసులు తెలిపారు. బాధితురాలు, ఆమె భర్తను కారులో తీసుకెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని కేసు దర్యాప్తు చేస్తున్న వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డి పరిశీలించారు

ఇకపోతే.. మహిళ కిడ్నాప్, అత్యాచారం కేసులో సికింద్రాబాద్ మారేడ్ పల్లి సీఐ నాగేశ్వరరావుపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే.

ఈ నెల 6న వివాహితపై అత్యాచారం చేసి, బాధితురాలితో పాటు ఆమె భర్తను బలవంతంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని ఎల్మినేడుకు కారులో తీసుకెళుతుండగా కారు ప్రమాదానికి గురైంది. కారు నడుపుతున్న నాగేశ్వరరావు భుజానికి గాయం కావడంతో బాధిత దంపతులిద్దరూ తప్పించుకొని వనస్థలిపురంపోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సీఐ నాగేశ్వర్ రావును సస్పెండ్ చేస్తూ ఆదశాలు జారీ చేశారు.

 ప్రమాదంలో గాయపడిన ఇన్​స్పెక్టర్ తొలుత అజ్ఞాతంలోకి వెళ్లాడు. బాధితులతో మాట్లాడి రాజీ కుదుర్చుకునేందుకు యత్నించాడు. కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసు ఉన్నతాధికారులు ఆయనను పట్టుకొనేందుకు మూడు పోలీసు బృందాలను రంగంలోకి దించారు. ఈ క్రమంలోనే ఎస్​వోటీ పోలీసులు నేడు నాగేశ్వరరావును అరెస్ట్​ చేశారు.

Related posts