telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

హైదరాబాద్ : … చెట్లు నరికిన వ్యక్తికి .. అటవీశాఖ భారీ జరిమానా…

penalty to man who cut trees in hyd

పర్యావరణ కాలుష్యంపై ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. ఉన్న కాస్త పచ్చదనాన్ని కాపాడుకోడానికి తీవ్రంగా ప్రయాణిస్తుంది. చెట్ల సంఖ్య క్రమంగా తగ్గిపోతున్న నేపథ్యంలో అధికారులు కఠిన చట్టాలు అమలు చేస్తున్నారు. ఇందుకు ఉదాహరణ, హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో ఇటీవల జరిగిన సంఘటనే నిదర్శనం. బంజారాహిల్స్ రోడ్ నెం.12లో చెట్లను నరికించినందుకు గాను ఓ భవన యజమానికి అటవీ శాఖ అధికారులు జరిమానా విధించారు.

బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఎదురుగా ఓ బహుళ అంతస్తుల భవనం నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న మూడు చెట్లను సంబంధిత యజమాని నరికించి వేశారు. ఈ నేపథ్యంలో అటవీశాఖాధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో, అధికారులు కొందరు అక్కడికి వెళ్లి పరిశీలించారు. మూడు చెట్లు నరికినట్టు వారి పరిశీలనలో తేలింది. దీంతో రూ.39,060 జరిమానా విధించడంతో, ఆ జరిమానాను సదరు యజమాని చెల్లించినట్టు సమాచారం.

Related posts