telugu navyamedia
సినిమా వార్తలు

మెగాస్టార్ సరసన ఐశ్వర్యారాయ్ ?

Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాథ ఆధారంగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న చిత్రం “సైరా న‌ర‌సింహారెడ్డి”. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై రామ్ చ‌ర‌ణ్ నిర్మిస్తున్నాడు. న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బ‌చ్చ‌న్, విజ‌య్ సేతుప‌తి, సుదీప్‌, జ‌గ‌ప‌తి బాబు వంటి టాప్ స్టార్స్ న‌టిస్తున్నారు. అక్టోబ‌ర్ 2న గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా చిత్రం విడుద‌ల కానుంది. ఈ చిత్రం ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. దీంతో చిరంజీవి తన తదుపరి చిత్రంపై దృష్టి పెట్టారు. దర్శకుడు కొరటాల శివ చిత్రంలో చిరంజీవి నటిస్తారని టాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్‌పై కూడా పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. అందాల తార, మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్.. చిరంజీవి సరసన నటిస్తారని ప్రచారం జరుగుతోంది. తొలుత అనుష్క, నయనతార, తమన్నా అని అనుకున్నారట. కానీ దర్శకుడు కొరటాల శివ ఆలోచనల మాత్రం వేరేలా ఉందట. ఐశ్వర్యరాయ్‌ అయితే బాగుంటుందని భావిస్తున్నారట. ఈ విషయాన్ని నిర్మాత రామ్ చరణ్‌తో కూడా చర్చించినట్లు తెలుస్తోంది. అటు రామ్ చరణ్ కూడా ఐశ్వర్యరాయ్‌ను ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. త్వరలో ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Related posts