” పంజా వైష్ణవ్ తేజ్ , రకుల్ ప్రీత్ సింగ్ తో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో సాయిబాబా, రాజీవ్ రెడ్డి నిర్మించిన “కొండ పొలం ” సినిమా ఇప్పుడే చూశాను. నాకెంతో నచ్చింది. ఈ సినిమాకు అవార్డులతో పాటు రివార్డులు కూడా వస్తాయని నాకు నమ్మకం వుంది “.
గురువారం రోజు చిరంజీవి తన మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన రెండవ సినిమా “కొండ పొలం “ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ థియేటర్లో చూశారు. కొండ ప్రాంతం నేపథ్యంలో నిర్మించిన అందమైన ప్రేమ కథకు చక్కటి సందేశం జోడించి దర్శకుడు క్రిష్ అద్భుతంగా ఈ సినిమాను తెర కెక్కించారని చిరంజీవి ప్రశంసించారు.
“క్రిష్ ఎల్లప్పుడూ విభిన్న నేపధ్య కథాంశాలను ఎంచుకొని , వాటిని తనదైన శైలిలో రూపొందించడం, నటీనటుల నుంచి చక్కని నటనను రాబట్టడంలో క్రిష్ సిద్దహస్తుడని చిరంజీవి ట్వీట్ చేశారు. “కొండ పొలం ” సినిమాకు అవార్డులతో పాటు ప్రేక్షకుల నుంచి .ప్రశంశలు వస్తాయని నాకెంతో నమ్మకం ఉందని చిరంజీవి తెలిపారు. ఈ సందర్భంగా చిరంజీవి దర్శకుడు క్రిష్ , వైష్ణవ్ తేజ్ , రకుల్ ప్రీత్ , నిర్మాతలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఇది చాలా అద్భుతం.. కేవలం ఒకే ఒక్క మనిషి డొనాల్డ్ ట్రంప్ ఇది చేయగలిగారు : ఆర్జీవీ