telugu navyamedia
రాశి ఫలాలు

అక్టోబర్8(శుక్రవారం) రాశి ఫలాలు

మేషం : మత్స్యు, కోళ్లె, గొర్రెల వ్యాపారస్తులకు కలిసిరాగలదు. నిరుద్యోగులకు అనుకూలం. వ్యాపారులకు, స్వయం ఉపాధి రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది.

వృషభం : ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. పెళ్లి సంబంధం కుదరవచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక ప్రయత్నాలకు సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది.

మిథునం : ఉద్యోగులకు బాగుంటుంది. వృత్తి, వ్యాపారాలుకు అనుకూలం. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది.  నిరుద్యోగుల ప్రయత్నాలు సత్ఫలితం ఇచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

కర్కాటకం : ఖర్చులు తగ్గించుకోవాలి. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగుపడుతుంది. వివాహ ప్రయత్నాలకు అనుకూలం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారులుకు శ్రమతో మంచి ఫలితాలు లభిస్తాయి.

సింహం : కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగంలోని వారికి సమయం బాగుంది. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.

కన్య : ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. ఖర్చులు అదుపు చేసుకోవాలి. కొబ్బరి, పండ్లు, పూల, కూరగాయల వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది ఆరోగ్యం జాగ్రత్త.

తుల : మిత్రులను కలుసుకుంటారు. సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు. ఆదాయం నిలకడగా ఉంటుంది.ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది.

వృశ్చికం : పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. వృత్తి, వ్యాపారాల, ఉద్యోగులకు అనుకూలం. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. అన్ని విధాలా అను కూలమైన సమయం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది.

ధనస్సు : మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. ఉద్యోగులకు అనుకూలం. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోండి. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం జాగ్రత్త.

మకరం : ఉద్యోగులకు సమయం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. ఆదాయాన్ని పెంచుకునే దిశలో ఆలోచనలు ప్రారంభిస్తారు.

కుంభం : ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడతారు. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్త. ఎంతో శ్రమ మీద పనులు పూర్తవుతాయి.

మీనం : ఉద్యోగులకు అనుకూలం. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్త. సామాజిక కార్యకలాపాల్లో పాల్గొంటారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులపై శ్రద్ధ వహించాలి.

Related posts