telugu navyamedia
వ్యాపార వార్తలు

భగ్గుమంటున్న పెట్రోల్, డీజిల్ ధరలు..

దేశంలో పెట్రోల్, డీజిల్ మంటలు భగ్గుమంటున్నాయి. అటు మెట్రో నగరాలతోపాటు అన్ని నగరాల్లో ఇదే పరిస్థితి ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ పెట్రోల్, డీజిల్ ధరల్లోనూ హెచ్చు తగ్గులు ఉన్నాయి. పెరుగుతున్న ముడిచమురు ధరలు సామాన్యుడికి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. కరోనా కష్ట కాలంలో కూడా ఇంధన రేట్లను పెంచడం దారుణమని వాపోతున్నారు. గత నాలుగు రోజులుగా ప్రతిరోజూ చమురు ధరలు పెరుగుతూనే ఉన్నాయి.

ఈ క్ర‌మంలో దేశవ్యాప్తంగా శుక్రవారం మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర 30 పైసలు పెరగ్గా.. డీజిల్​పై 35 పైసలు పెరిగింది. ఈ మేరకు చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.103.54కు చేరగా.. డీజిల్​ ధర రూ.92.13కు పెరిగింది.

India's fuel demand up 11% in June as economic activity sees spurt - The Federal

మెట్రో నగరాల్లో పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ వివరాలు ..
ముంబయిలో లీటర్​ పెట్రోల్​​ ధర 29 పైసలు పెరిగి రూ.109.51కి చేరగా.. లీటర్​ డీజిల్​​ ధర రూ. 99.88 వద్ద కొనసాగుతోంది.

కోల్​కతాలో లీటర్​ పెట్రోల్​పై 29 పైసలు పెరగడం వల్ల ధర రూ.104.19కు చేరింది. లీటర్​ డీజిల్​ ధర​ రూ.95.19గా ఉంది.చెన్నైలో లీటర్​ పెట్రోల్​​ ధర​ 26 పైసలు పెరిగి రూ.100.98 వద్ద కొనసాగుతోంది. లీటర్​ డీజిల్ ధర​ రూ.96.56గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో…
హైదరాబాద్​లో పెట్రోల్ లీటర్ ధర 31 పైసలు పెరిగింది. ఫలితంగా ప్రస్తుతం లీటర్ ధర రూ.107.67కు చేరుకుంది. మరోవైపు డీజిల్ ధర 39 పైసలు అధికమై.. లీటర్​ రూ.100.48కి చేరింది.

విశాఖపట్నంలో 30 పైసలు పెరిగిన లీటర్ పెట్రోల్ ధర.. రూ.108.55కు చేరుకుంది. డీజిల్​పై 36 పైసలు పెరిగి.. రూ.100.83కు చేరింది.

గుంటూరులో పెట్రోల్ ధర 30 పైసలు ఎగబాకింది. ప్రస్తుతం లీటర్​ ధర రూ.109.82గా ఉంది. డీజిల్​ లీటర్​కు 36 పైసలు పెరిగి.. రూ.102.06 వద్ద ఉంది.

విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.109.70 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.101.74 లకు లభిస్తోంది.

Related posts