telugu navyamedia
రాశి ఫలాలు

సెప్టెంబర్ 1 (బుధవారం) రాశి ఫలాలు

మేషం: వ్యాపారులకు అనుకూలం. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ప్రయాణాలు చేసే అవకాశముంది. శుభవార్తలు వింటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు.

వృషభం: వ్యాపారులకు అనుకూలం. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నవారికి మిశ్రమ ఫలితాలు. వివాదాలకు పోవద్దు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా పూర్తి చేస్తారు. పాత మిత్రులను కలుసుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

​మిథునం: ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. స్థిరాస్తి కొనుగోలుకు ఆలోచన చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలు పాటించండి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో స్థిర బుద్ధితో ముందుకెళ్లాలి.

​కర్కాటకం: కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఇతరులకు సహాయం చేస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. భవిష్యత్తుకు బాటలు వేస్తారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా చిత్తశుద్ధితో వాటిని అధిగమిస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.

​సింహం: ఉద్యోగులకు అనుకూలం. బంధు మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక చింత పెరుగుతుంది. చేపట్టిన పనులు పూర్తవుతాయి. పాత మిత్రులను కలుసుకుంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు.

​కన్య: ఉద్యోగులకు పని భారం ఉంటుంది. చేపట్టిన పనులు సులభంగా పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ముఖ్యమైన విషయాల్లో వాయిదా వేయవద్దు. మనోధైర్యంతో ముందుకు వెళ్లండి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.

తుల: వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు. నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపాటు వద్దు. ఓ సమస్యను పరిష్కరిస్తారు. తొందరపాటు నిర్ణయాలు మంచిదికాదు. మనోధైర్యంతో చేపట్టిన పనులు శుభ ఫలితాలనిస్తాయి.

వృశ్చికం: ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. వివాదాలకు పోవద్దు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం. భవిష్యత్తుకు బాటలు వేస్తారు. అభివృద్ధికి తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి.

​ధనస్సు: శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఎవరినీ గుడ్డిగా నమ్మొద్దు. కుటుంబ సభ్యుల సలహాలు పాటించండి. మాటలను అదుపులో ఉంచుకోండి.

​మకరం: వృత్తి, వ్యాపారులకు అనుకూలం. పెద్దలను కలుస్తారు. భవిష్యత్తుకు బాటలు వేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. పాత మిత్రులను కలుసుకుంటారు. మీ ప్రతిభతో గొప్ప కార్యాల్లో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. మానసిక ఆనందం పొందుతారు.

కుంభం: చేపట్టిన పనులు పూర్తిచేస్తారు. తోటివారి సహకారం ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఎవరితోనూ వివాదాలకు పోవద్దు.

మీనం: ఆర్థికంగా బాగుంటుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కొన్ని క్లిష్టమైన సమస్యను పరిష్కరిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది.

Related posts