telugu navyamedia
సినిమా వార్తలు

మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ ఫస్ట్ లుక్ రిలీజ్ ఎప్పుడంటే..

మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో పుల్ జోస్‌లో ఉన్నారు. వరుస సినిమాలతో యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నారు.ప్రస్తుతం చిరంజీవి చేతిలో నాలుగు సినిమాలున్నాయి. ఇప్పటికే ‘ఆచార్య’ మూవీని రిలీజ్ కు సిద్ధంగా చేశారు మేకర్స్.. కాగా ‘గాడ్ ఫాదర్’ మూవీ చిత్రీకరణ పనులను కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నారు మేకర్స్.

తాజాగా చిరంజీవి నటిస్తున్న ‘భోళాశంకర్’​ సినిమా నుంచి కొత్త అప్డేట్​ వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్​ లుక్​ను మార్చి 1న మహా శివరాత్రి కానుకగా ఉదయం 9.05గంటలకు రిలీజ్​ చేస్తానని ప్రకటించింది.

తమిళంలో సూపర్‌హిట్ అందుకున్న ‘వేదాళం’ రీమేక్‌గా ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. మెహర్​రమేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. ​అన్నాచెల్లెళ్ల అనుబంధంతో పాటు పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా సిద్ధమవుతోంది. ఇందులో చిరు సోదరి పాత్రలో కీర్తి సురేశ్‌ కనిపించనున్నారు. అలాగే మెగాస్టార్‌కు జోడీగా తమన్నా సందడి చేయనున్నారు

. మణిశర్మ కుమారుడు మహతి సాగర్‌ స్వరాలు సమకూర్చనున్నారు. ఈ సినిమా రెగ్యులర్‌ షూట్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Related posts