బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించిన ప్రముఖ నటుడు రంజిత్ చౌదరి(65) కన్నుమూశారు. రంగస్థలం నుంచి బాలీవుడ్‌లో ప్రముఖ నటుడిగా ఎదిగారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో రంజిత్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే కరోనా నేపథ్యంలో ఇప్పుడు ఈయన మరణించడం పలు అనుమానాలకు తావిస్తోంది. హృషికేష్ ముఖర్జీ దర్శకత్వంలో రేఖ, రాకేష్ రోషన్ ‘ఖూబ్ సూరత్’ సినిమాలో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కట్టా మీటాతో పాటు పలు చిత్రాల్లో నటించారు. అంతేగాక హాలీవుడ్‌లోనూ ‘లోన్లీ అమెరికా’తో పాటు మరిన్ని చిత్రాల్లో, టీవీ సిరీయల్స్‌లో నటించిన ఆయన మరణానికి బాలీవుడ్, హాలీవుడ్ నటులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. అమెరికా టీవీ సిరీస్ ‘ప్రిజన్ బ్రేక్’లో డాక్టర్ మార్విన్ గుడాట్ పాత్రలో రెండు ఎపిసోడ్‌లో నటించారు. దీపా మెహతా ‘సామ్ అండ్ మి చిత్రానికి’ స్క్రీన్ ప్లే కూడా చేశారు. లాక్‌డౌన్ ముగిసిన తర్వాత సంతాప సభ జరపబోతున్నట్టు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
అంతా ఆమె వల్లే… మాజీ భార్యపై స్టార్ హీరో కామెంట్స్