telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు

విమాన సంస్థ విస్తారా నుండి … బడ్జెట్ లో అంతర్జాతీయ సేవలు…

cheapest international flights from vistara

విమానయాన సంస్థ విస్తారా దేశీయ బడ్జెట్‌ లో త్వరలో అంతర్జాతీయ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఏడాది రెండో అర్ధభాగంలో అంతర్జాతీయ విమాన సర్వీసులను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం. విస్తారా గ్రూప్‌ సంస్థ ఐఏటీఏ వార్షిక జనరల్‌ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా సంస్థ సీఈవో లెస్లీ థంగ్‌ మాట్లాడుతూ.. ‘విమానయాన రంగంలో భారత్‌ అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌. సుదీర్ఘకాలం ఇక్కడ సేవలు అందించాలనుకుంటున్నాం. 2019 రెండో అర్ధభాగంలో అంతర్జాతీయ కార్యకలాపాలను మొదలుపెట్టేందుకు ప్రణాళికలు చేస్తున్నాం’ అని తెలిపారు.

ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఆయన వెల్లడించకపోవటం విశేషం. టాటాసన్స్‌, సింగపూర్ ఎయిర్‌లైన్స్‌ సంయుక్తంగా 2015 జనవరిలో విస్తారా ఎయిర్‌లైన్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం విస్తారా వద్ద 22 విమానాలు ఉన్నాయి. వారానికి 850 విమాన సర్వీసులను అందిస్తోంది. మరో నాలుగు బోయింగ్‌ 737-800 ఎన్‌జీ, రెండు ఏ320 నియో విమానాలను లీజుకు తీసుకుంటున్నట్లు గత నెల విస్తారా ప్రకటించింది. దీంతో పాటు మరో 50 ఎయిర్‌బస్ విమానాలకు గతేడాది ఆర్డర్‌ ఇచ్చింది. 2023 నాటికి ఈ విమానాలు విస్తారా చేతికి రానున్నాయి.

Related posts