telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో.. బట్టల రామస్వామి బయోపిక్కు చిత్రం..

battala ramaswamy biopic movie

నేహా శ్రీ అండ్ సుదీక్ష సమర్పణలో సెవెన్ హిల్స్ పతాకంపై సతీష్ కుమార్ నిర్మాణంలో రామ్ నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘బట్టల రామస్వామి బయోపిక్కు’. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న సందర్భంగా చిత్రయూనిట్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత సతీష్ కుమార్ మాట్లాడుతూ.. ”నవంబర్‌లో మొదలు పెట్టి డిసెంబర్ 18న గుమ్మడికాయ కొట్టాము. సింగిల్ షెడ్యూల్‌లో సినిమాను పూర్తి చేశాము. కథను నమ్మి కథే హీరో అనుకొని చేసిన చిత్రం ఇది. సందర్భానికి అనుకూలమైన కామెడీతో సినిమా చేయడం జరిగింది. ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ అయ్యి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉంది. త్వరలో అది కూడా పూర్తిచేసి ఏప్రిల్ నెలాఖరులో కానీ మే నెలలో కానీ సినిమాను విడుదల చేయలనుకుంటున్నాము. ఈ 2020 మా అందరికీ మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాము..” అన్నారు.

నటుడు భద్రం మాట్లాడుతూ.. ఈ సినిమా ఒక కామన్ మ్యాన్ బయోపిక్కు. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా సాగే కథాశం. పెళ్లైన కొత్తలో జంటకు ప్రతి రోజూ పండగలానే ఉంటుంది. ఆ తరువాత కొన్నాళ్ళకు ముందుంది ముసళ్ళ పండగలా అనిపిస్తుంది. అదే ఈ సినిమాలో చూపించడం జరిగింది. నా పాత్ర ఎప్పటిలానే ఆకట్టుకుంటుంది. ఈ 2020లో సర్‌ప్రైజ్ హిట్ అవుతుందని నమ్మకంగా చెప్పగలనని అన్నారు. ఈ కార్యక్రమంలో శాంతి రావు, సాత్త్వి, కెమెరామెన్ కర్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి డి.ఓ.పి: కర్ణ పైరసాని, ఎడిటర్: సాగర్ దాడి, పిఆర్‌ఓ: బి.వీరబాబు; మాటలు, పాటలు: వాసుదేవమూర్తి, ప్రొడ్యూసర్: సతీష్ కుమార్.ఐ; కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, దర్శకత్వం: రామ్ నారాయణ్.

Related posts