రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీఎస్ కృష్ణన్ మృతి చెందారు. కొంతకాలంగా ఢిల్లీ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం ఉదయం అయిదు గంటలకు తుదిశ్వాస విడిచారు. గతంలో ఏపీభవన్ రెసిడెంట్ కమిషనర్‌గా పని చేశారు. ఎస్సీ, ఎస్టీ, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృష్ణన్ కృషి చేశారు. అఖిల భారత సర్వీసుల్లో ఉత్తమ అధికారిగా ఆయన మన్ననలు పొందారు. కృష్ణన్ మృతి పట్ల ఏపీ భవన్ అధికారులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
వీపీసింగ్ ప్రధానిగా ఉండగా మండల్ కమిషన్ సిఫార్సుల విషయంలో ప్రముఖ ఐఏఎస్ అధికారి పీఎస్ కృష్ణన్ కృషి మరువలేనిది. పీఎస్ కృష్ణన్ జీవిత చరిత్ర ‘సామాజిక న్యాయ మహాసమరం’ తెలుగులో కూడా అనువాదం అయింది. అలాగే ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ముస్లిం రిజర్వేషన్ల రూపకల్పనలో కృష్ణన్ ప్రముఖ పాత్ర వహించారు.