telugu navyamedia
క్రీడలు వార్తలు

ఆసీస్ విజయం పై ఎక్కువ సంబరాలు జరుపుకోకండి : పీటర్సన్

Kevin

ఆసీస్ పర్యటనలో ముఖ్యమైన టెస్ట్ సిరీస్ లో భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ విజయం తరువాత ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ హెచ్చరించాడు. ఆసీస్ తో జరిగిన నాలుగు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో భారత జట్టు విజయం సాధించిన తర్వాత వారిని అభినందించిన పీటర్సన్… ఆసీస్ పర్యటన కాదు వచ్చే నెలలో హోమ్ గ్రౌండ్ లో ఇంగ్లాండ్ తో జరిగే టెస్ట్ సిరీస్ భారత జట్టుకు అతి పెద్ద సవాల్.. కాబట్టి ఆతిథ్య జట్టు జాగ్రత్తగా ఉండాలని తెలిపిన పీటర్సన్.. ఆసీస్ పై విజయానికి ఎక్కువగా సంబరాలు జరుపుకోకండి… ఇంగ్లాండ్ తో టెస్ట్ కు సిద్ధంగా ఉండండి అని హెచ్చరించాడు. ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న ఇంగ్లాండ్, ఫిబ్రవరి మొదటి వారంలో భారత్ కు చేరుకుంది. ఈ పర్యటనలో వారు భారత జట్టుతో 4 టెస్ట్, 3-వన్డే మరియు 5 టీ 20 ల సిరీస్ లను ఆడనున్నారు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి 2 టెస్టుల్లో 18 మంది సభ్యుల భారత జట్టును బిసిసిఐ మంగళవారం ప్రకటించింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, ఫాస్ట్ బౌలర్ ఇశాంత్ శర్మ తిరిగి టెస్ట్ సిరీస్ కోసం టెస్ట్ జట్టులోకి వచ్చారు. గబ్బాలో జరిగిన సిరీస్ నిర్ణయాత్మక నాల్గవ మరియు ఆఖరి మ్యాచ్‌ను 3 వికెట్ల తేడాతో హెలిచి 33 సంవత్సరాలలో బ్రిస్బేన్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఓడించిన తొలి జట్టుగా భారత్ నిలిచింది.

Related posts