ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, ఆప్ నేతల మధ్య మాటల యుద్దం కొనసాగుతుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శలు గుప్పించారు. అబద్ధాలు చెప్పడంలో కేజ్రీవాల్ నెంబర్ వన్ అని విమర్శించారు. కేజ్రీవాల్ అధికారంలోకి రాకముందు ఢిల్లీ జల్ బోర్డు ఏడాదికి రూ. 178 కోట్ల లాభాలతో నడిచేదని… ప్రస్తుతం అది ఏడాదికి రూ. 800 కోట్ల నష్టాన్ని చవిచూస్తోందని అమిత్ షా విమర్శించారు.
ఢిల్లీలో వెయ్యి కొత్త పాఠశాలలు, 50 కొత్త కాలేజీలను ఏర్పాటు చేస్తామని, నగరంలో 15 లక్షల సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని ఐదేళ్ల క్రితం కేజ్రీవాల్ ఇచ్చిన హామీలు ఇంత వరకు నెరవేరలేదని అన్నారు. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ కు వెళ్లి, అక్కడి గంగానదిలో ఒకసారి స్నానం చేయాలని కేజ్రీవాల్ కు ఆయన సూచించారు. అప్పుడుకాని, నదులను పరిశుభ్రంగా ఎలా ఉంచాలన్న విషయం కేజ్రీవాల్ కు అర్థం కాదని చురక అంటించారు.
మూఢ నమ్మకాలతో సచివాలయ భవనాలను కుల్చోద్దు: రేవంత్