భారత క్రికెట్ చరిత్రలో 1983 సంవత్సరాన్ని సువర్ణాక్షరాలతో లిఖించాలి. ఆ ఏడాది కపిల్ దేవ్ నాయకత్వంలో భారత క్రికెట్ జట్టు విశ్వ విజేతగా ఆవిర్భవించింది. ఈ ఆసాధారణ ప్రయాణాన్ని వెండితెరపై `83` సినిమాగా ఆవిష్కరిస్తున్నారు డైరెక్టర్ కబీర్ ఖాన్. అన్నపూర్ణ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ సమర్పణలో కబీర్‌ఖాన్ ఫిలిమ్స్ నిర్మాణంలో దీపికా పదుకొనె, సాజిద్ నడియద్‌వాలా, కబీర్ ఖాన్, నిఖిల్ ద్వివేది, విష్ణు ఇందూరి, 83 ఫిలింస్ లిమిటెడ్, ఫాంటమ్ ఫిలింస్ ఈ బిగ్గెస్ట్ స్పోర్ట్స్ డ్రామాను నిర్మిస్తున్నారు. `83` చిత్రాన్నిఏప్రిల్ 10న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు అన్నపూర్ణ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ తెలుగులో `83` చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఇందులో రణ్‌వీర్ కపిల్ దేవ్ పాత్రలో నటిస్తుండగా.. ఆయన భార్య రోమి భాటియాగా దీపిక పదుకోన్ నటించారు. తాజాగా రోమి పాత్రలో దీపికాకి సంబంధించిన లుక్ విడుదల చేశారు మేకర్స్. రణ్‌వీర్‌తో కలిసి ఉన్న దీపికా లుక్ ఆకట్టుకుంటుంది.ఇప్పటికే దీపికా, రణ్‌వీర్‌లు రామ్ లీలా, బాజీరావు మస్తానీ, పద్మావత్ చిత్రాలలో కలిసి నటించారు. రియల్ లైఫ్‌లో భార్య భర్తలు అయిన వీరిద్దరు పెళ్లి తర్వాత కలిసి నటించిన తొలి చిత్రం 83 కావడం విశేషం. 83 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుండగా.. ఇండియన్ క్రికెట్ టీమ్ తక్కువ స్కోరుకే అవుట్ కావడంతో రోమితో పాటు పలువురు అర్ధాంతరంగా స్టేడియం నుంచి బయటకు వెళ్తారు. అయితే అనూహ్యంగా దిగ్గజ జట్టు వెస్టిండీస్‌పై భారత్ పైచేయి సాధించడంతో తిరిగి మ్యాచ్ చూడటానికి వస్తే.. సెక్యూరిటీ అనుమతించకపోవడమనే సీన్ సినిమాకు ఓ హైలెట్‌గా నిలుస్తుందని చెబుతున్నారు. ఆ సమయంలో రోమి పడే ఆవేదన డ్రమాటిక్‌గా ఉంటుందట. ఈ చిత్రంలో సాకీబ్ సలీం, హర్డీ సందూ, అమ్మీ విర్క్, తాహీర్ బాసిన్, చిరాగ్ పాటిల్, పంకజ్ త్రిపాఠి తదితరులు నటిస్తున్నారు.
previous post