తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆర్భాటాలకు దురంగా ఉంటారు. ఆయన చేతికి ఉంగరాలు, వాచీలు కూడా ధరించరు. అయితే ఎప్పుడూ లేనిది మదనపల్లెలో జరిగిన మినీ మహనాడుకు హజరైన చంద్రబాబు ఎడమ చేతి చూపుడు వేలికి ఓ ఉంగరం కనిపించింది.
అయితే ఎప్పుడూ లేనిది ఆయన తన చేతికి ఉంగరం కన్పించడంపై ప్రతి ఒక్కరూ అదే ఉంగరంపై చర్చించుకుంటున్నారు .పలు మీడియా సంస్థలతో పాటు సోషల్ మీడియాలోనూ విస్తృత చర్చ జరిగింది. ఆ ఉంగరం ఖచ్చితంగా జాతకాలు చూసి ఎంపిక చేసుకున్నదేనని కొంత మంది తేల్చారు. మరికొంత మంది అది మహార్జాతకం కోసం ఎంపిక చేసుకున్న ఉంగరం అని.. అందుకే ఆ వేలికి పెట్టుకున్నారని విశ్లేషించారు.
ఇదే అంశంపై రాజంపేట నియోజకవర్గ సమీక్ష సందర్భంగా టీడీపీ కార్యకర్తలు ప్రస్తావించడంతో.. చంద్రబాబు ఉంగరం ప్రత్యేకతను వివరించారు. ఉంగరంలో కంప్యూటర్‌తో అనుసంధానించిన చిప్ ఉందని తెలిపారు. తన ఆరోగ్యాన్ని ఈ చిప్ మానిటర్ చేయనుందని ఆయన చెప్పారు. ఎంత సేపు తాను నిద్రపోయాను, ఎంతసేపు నడిచాను. ఎంత సేపు కూర్చున్నాను. తన శరీరంలో అవయవాలు ఏ రకంగా పని చేశాయనే విషయాలను ఈ చిప్ ను అనుసంధానం చేసిన కంప్యూటర్‌కు ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేస్తుంది. కంప్యూటర్ కు అందిన సమాచారం ఆధారంగా ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలనే విషయమై డాక్టర్స్ సలహాలు ఇవ్వనున్నారు.
మరో వైపు ముందు రోజు తాను ఎక్కడెక్కడ తప్పు చేశాననే విషయాన్ని గుర్తించి ఆ తప్పులు చేయకుండా ఉండేందుకు ఈ రింగ్ లో ఉన్న చిప్ తనకు సహకరించనుందని చంద్రబాబు చెప్పారు.
టీడీపీకి సభ్యులంతా ఒకే కుటుంబమన్నారు. టీడీపీలో ఉన్నవారంతా కూడా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. సార్ చెప్పెదేదో చెబుతారు,మేం మాత్రం ఆరోగ్యం విషయంలో పట్టించుకోకపోతే తాను ఏం చేయలేనని చంద్రబాబు చెప్పారు. పార్టీ కార్యకర్తలనుండి నేతల వరకు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.
గత ప్రభుత్వం చేసిన అశ్రద్ధ వల్లే విత్తనాల కొరత: మంత్రి కన్నబాబు