telugu navyamedia
ఆంధ్ర వార్తలు

కాలర్ ఎగరేసుకుని తిరుగుదామన్నారు..కానీ కాలర్ పట్టుకుని ప్రశ్నిస్తున్నారు

ఆంధ్రప్రదేశ్ లో జగన్ పాలనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ప్రభుత్వ తీరుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుదన్న చంద్రబాబు జ‌గ‌న్ పాలనను ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.

కాలర్‌ ఎగరేసుకుని తిరుగుదామనుకున్న పార్టీ నేతలను.. ప్రజలు కాలర్‌ పట్టుకుని ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నారు. సంక్షేమంలో కోతలు, అభివృద్ది పనులపై ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలకు ప్రభుత్వం అసహనానికి లోనవుతుంది.

చిత్తూరు జిల్లా పూతలపట్టులో ఎమ్మెల్యేను విద్యా దీవెనపై ప్రశ్నించిన ఇంజినీరింగ్ విద్యార్థి జశ్వంత్‌పై కేసు పెట్టి అరెస్టు చెయ్యడం ప్రభుత్వం అసహనానికి ప్రత్యక్ష ఉదాహ‌ర‌ణ అని అన్నారు

విద్యార్థులపైనా కేసులు పెట్టి వారి జీవితాలను నాశనం చేస్తారా?.. పాలనను ప్రశ్నించిన ప్రతి వారిపై కేసు పెట్టాలి అని ఈ ప్రభుత్వం భావిస్తే…. రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మందిపైనా జగన్ కేసులు పెట్టాల్సి ఉంటుంది..

వేపనపల్లి గ్రామంలో ఘటనకు వైసీపీ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థిపై అతనికి మద్దతుగా నిలిచిన గ్రామస్థులు, టీడీపీ నేతలపై పెట్టిన కేసు వెనక్కి తీసుకోవాలి… వెంటనే అందరినీ విడుదల చెయ్యాలిస్థానిక పోలీసుల అత్యుత్సాహంపై డీజీపీ చర్యలు తీసుకోవాలని చంద్ర‌బాబు కోరారు.

Related posts