telugu navyamedia
రాజకీయ

ఢిల్లో ఉద్రిక్త‌త : రాహుల్ , ప్రియాంక‌ను అరెస్ట్ చేసిన పోలీసులు

కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ధరల పెరుగుదల, జీఎస్టీ , నిరుద్యోగం స‌మ‌స్య‌ల‌పై కేంద్రానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆందోళ‌న చేపట్టింది.

ఇందులో భాగంగా  రాహుల్ గాంధీ, సోనియా గాంధీ సహా పలువురు ఎంపీలు పార్లమెంట్​లో నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపారు. ధరల పెరుగుదలకు నిరసనగా పార్లమెంటు నుంచి విజయ్ చౌక్‌ రోడ్డులో రాష్ట్రపతి భవన్‌కు ర్యాలీగా వెళ్లాలని కాంగ్రెస్ శ్రేణులు భావించాయి.

Congress protest on inflation

అయితే పారామిలిటరీ, పోలీసు బలగాలు ఆ మార్గాన్ని బ్లాక్ చేశాయి. ఎవరూ ముందుకు వెళ్లకుండా బారీకేడ్లు ఏర్పాటు చేశాయి. ఈ క్రమంలోనే రాష్ట్రపతి భవన్ మార్గంలో వెళ్తున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. రాహుల్, ప్రియాంక సహా ఇతర నేతల్ని అదుపులోకి తీపుకుని పోలీస్​ లైన్స్​లోని కింగ్స్​వే క్యాంపునకు తరలింంచారు.

ప్రజా సమస్యలను లేవనెత్తడమే తమ కర్తవ్యమని.. ఈ విధులు నిర్వర్తించినందుకు తమ ఎంపీలను అదుపులోకి తీసుకుంటాన్నరని రాహుల్ ఆరోపించారు.

Related posts