telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఫేక్ సర్వేపై జూబ్లీహిల్స్ పీఎస్‌లో కేసు

TDP Change Puthalapattu Candidate

ఏపీలో టీడీపీ మరోసారి విజయం సాధిస్తుందంటూ విడుదలైన ఫేక్ సర్వేపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఏపీ ఎన్నికలపై తెలంగాణ ఇంటెలిజెన్స్ సర్వే నిర్వహించిందని, అందులో టీడీపీకి 126, వైసీపీకి 39, జనసేనకు 10 సీట్లు వస్తాయంటూ నకిలీ సర్వే తయారు చేసి ప్రచారం చేస్తున్నారంటూ తెలంగాణ ఇంటెలిజెన్స్ ఇన్‌స్పెక్టర్ హరిప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

టీఎఫ్‌సీ మీడియా, వీరపనేని రామకృష్ణ నేతృత్వంలోని మ్యాంగో అండ్ వాక్డ్ ఔట్, అదుగాని మల్లేశ్ నేతృత్వంలోని ఛాలెంజ్ మిత్ర, చీపురుపల్లి రాంబాబు నేతృత్వంలోని టాలీవుడ్ నగర్ సంస్థలు ఈ ఫేక్ సర్వేలను ప్రచారం చేస్తున్నట్లు హరిప్రసాద్ ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఫిర్యాదుతో పాటు యూట్యూబ్ లింకులు, అందులో పేర్కొన్న అంశాలకు సంబంధించిన వీడియోలను హరిప్రసాద్ పోలీసులకు అందజేశారు. ఆయన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related posts