telugu navyamedia
రాజకీయ

విజయ్ రూపానిని అందుకే దించేశారా ?

వడ్డించేవాడు మనవాడైతే పంక్తిలో చివర కూర్చున్నా అన్నీ మన చెంతకే వస్తాయని అంటారు . ఇది అన్నివేళలా నిజం కాదని ఇప్పుడు గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని విషయంలో అర్థమై పోయింది . గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్న రూపాని రాజీనామా చెయ్యడం దేశ రాజకీయాల్లో చర్చినీయాంశం అయ్యింది .

విజయ్ రూపాని హోమ్ మంత్రి అమిత్ షా కు అత్యంత సన్నిహితుడు , ప్రియ శిష్యుడు . అలాగే గుజరాత్ గవర్నర్ ఆనంది బెన్ కు అత్యంత నమ్మకస్తుడు . అయినా విజయ్ ఎందుకు రాజీనామా చెయ్యవలసి వచ్చింది ? ఈ విషయం గురించి మీడియా ఆరాతీయడం మొదలు పెట్టింది .

కరోనా రెండవ దశ గుజరాత్ మీద ఎక్కువ ప్రభావితం చూపింది . ముఖ్యమంత్రిగా విజయ్ సకాలంలో దానిని సమర్ధవంతంగా ఎదుర్కోలేక పోవడం, ప్రజలకు టీకాలను అందించకపోవడం తో ప్రతి పక్షాలు విరుచుక పడ్డాయి . ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ , హోమ్ మంత్రి అమిత్ షా ఇద్దరు గుజరాత్ కు చెందినవారే . అక్కడ ఉన్నది కూడా బీజేపీ ప్రభుత్వమే .

Vijay Rupani resigns as Gujarat CM, Mansukh Mandaviya likely successor

ఈ విషయంలో మోడీ, అమిత్ ఇద్దరు సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడింది . అందుకే ‘మనవాడు అన్న అభిమానం ‘ పక్కన పెట్టి , విజయ్ ను రాజీనామా చెయ్యమని హుకుం జారీ చేశారట .
ఇంతకాలం తన పదవికి ముప్పులేదని భవిస్తూ వచ్చిన విజయ్ రూపాని ఢిల్లీ నుంచి ఆజ్ఞ రాగానే కంగు తిన్నాడు . గత్యంతరం లేని పరిస్థితుల్లో పెద్దల పరువు కాపాడటం కోసం “రాజీ ‘పడిపోయాడు .

After Vijay Rupani Stunner, BJP In a Huddle; New Guj CM to Take Oath Monday?

Related posts