telugu navyamedia
రాజకీయ వార్తలు

వారి కోసమే పౌరసత్వ సవరణ చట్టం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Kishan Reddy

పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ దేశాల్లోని అణచివేతకు గురైన మైనారిటీల కోసమే ఈ పౌరసత్వ సవరణ చట్టమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆ మూడు దేశాల్లో హింసకు గురవుతున్న మైనారిటీలైన సిక్కులు, బౌద్ధులు, పార్సీలు, హిందువులు, క్రిస్టియన్లు శరణార్థులుగా భారత్ కు వచ్చి దుర్భర జీవితం గడుపుతున్నారు. వారందరూ మతపరమైన వివక్షకు గురై వారి దేశంనుంచి వెళ్లగొట్టబడ్డారని తెలిపారు.

వారందరికీ చేయూత నందించడానికి మా ప్రభుత్వం నడుంబిగించింది. సీఏఏ చట్టం ఏ ఒక్క మతానికి, రాష్ట్రానికి, ప్రజలకు నష్టం కలిగించేది కాదు. ప్రతిపక్షాలు, మేధావులు బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. పౌరసత్వ సవరణ చట్టంపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని మోదీ ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.ఈ చట్టంపై ఎప్పుడో ఇక్కడికి వచ్చిన ముస్లింలు అపోహ పెట్టుకోవద్దన్నారు. శ్రీలంక నుంచి, ఉగాండా నుంచి వచ్చిన హిందువులకు పౌరసత్వం ఇచ్చామని మంత్రి తెలిపారు.

Related posts