జస్ప్రీత్ బుమ్రా భారత జట్టులో అడుగుపెట్టిన కొద్దికాలంలోనే ప్రధాన బౌలర్ గా ఎదిగిన విషయం తెలిసిందే. తాజాగా, వెస్టిండీస్ టెస్ట్ సిరీస్ లో తన ఖాతాలో అరుదైన రికార్డు చేరింది. భారత్ తరఫున తక్కువ టెస్టుల్లో 50 వికెట్లు సాధించిన బౌలర్ గా బుమ్రా రికార్డు పుటల్లోకెక్కాడు. బుమ్రా కేవలం 11 టెస్టుల్లోనే 50 వికెట్లు తీయడం విశేషం అని చెప్పాలి. ఇప్పటివరకు ఈ రికార్డు మహ్మద్ షమీ, వెంకటేశ్ ప్రసాద్ ల పేరిట ఉంది.
షమీ, వెంకీ ఇద్దరూ కూడా 13 టెస్టుల్లో 50 వికెట్లు సాధించారు. అయితే 25 ఏళ్ల బుమ్రా వీరికంటే రెండు టెస్టులు తక్కువగా ఆడి ఈ ఘనత నమోదు చేశాడు. ప్రస్తుతం వెస్టిండీస్ తో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న బుమ్రా ప్రత్యర్థి బ్యాట్స్ మన్ డారెన్ బ్రావోను అవుట్ చేయడం ద్వారా 50వ వికెట్ ను ఖాతాలో వేసుకున్నాడు.
అమరావతిలో వేల ఎకరాల భూములు కొన్నారు: విజయసాయిరెడ్డి