telugu navyamedia
ఆంధ్ర వార్తలు

రాయలసీమ ప్రజలకు క్షమాపణలు చెప్పిన సోము వీర్రాజు..

రాయలసీమ ప్రజలకు క్షమాపణలు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు క్షమాపణలు చెప్పారు.తాను వాడిన పదాలు రాయలసీమ ప్రజల మనసులను గాయపరిచాయని.. అందుకే వాటిని వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు. 

‘రాయలసీమ రతనాల సీమ ఈ పదం నా హృదయంలో పదిలం. రాష్ట్ర అభివృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరు విమర్శించే విషయంలో వాడిన పదాల వల్ల రాయలసీమ ప్రజలు మనసులు గాయపడ్డాయి. ఈ పదాలను వెనక్కి తీసుకుంటున్నాన‌ని ఈ మేరకు సోము వీర్రాజు ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

ఈ విషయంలో క్షమాపణలు చెబుతున్నాను. నేను నిరంతరం రాయలసీమ అభివృద్ధి విషయంలో అనేక వేదికలపై ప్రస్తావిస్తూ వస్తున్న విషయం ఆ ప్రాంత వాసులకు తెలుసు. రాయలసీమకు నికర జలాలు, పెండింగ్ ప్రాజెక్టుల విషయాలను అనేక సందర్భాల్లో ప్రస్తావించాను. రాయలసీమ అభివృద్ధి ఇంకా వేగవంతం కావాలనేదే బీజేపీ ఆలోచన’ అని సోమువీర్రాజు వివ‌ర‌ణ ఇచ్చారు.

 ‘జిల్లాకో ఎయిర్‌పోర్టు ఎందుకు? కర్నూలులో ఎయిర్‌పోర్టు.. బస్సులు వెళ్లడానికి దారిలేనటువంటి కర్నూలులో ఎయిర్‌పోర్టు.. రాయలసీమకు ఎయిర్‌పోర్టు.. కడపలో ఎయిర్‌పోర్టు.. హత్యలు చేసే జిల్లాలో కూడా ఎయిర్‌పోర్టుల అంటూ సోము వీర్రాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

 సోము వీర్రాజు  వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీకి చెందిన రాయలసీమ ప్రాంత నేతలతో పాటు వామపక్ష పార్టీల నేతలు,  ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే సోము వీర్రాజు.. సీమ ప్రజలకు క్షమాపణలు చెప్పారు.

Related posts