telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

మార్చిలో కేటీఆర్‌ కు పట్టాభిషేకం…

Raghunandan

త్వరలోనే తెలంగాణ సీఎం గా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. పగ్గాలు చేపట్టబోతున్నారని ఎప్పటి నుంచో గుసగుసలు వినిపిస్తున్నాయి… ఏ ఎన్నికలు వచ్చినా.. ఈ ఎన్నికల తర్వాత కేటీఆరే సీఎం అంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేయడం కూడా సర్వసాధారం అయ్యింది.. తాజాగా ఈ వ్యవహారంలో హాట్ కామెంట్లు చేశారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు.. కామారెడ్డిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. దుబ్బాక ఉప ఎన్నికల్లో హరీష్ రావుకు, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కేటీఆర్‌కు, నిజామాబాద్‌లో కవితకు ఓట్ల ద్వారా ప్రజలు బుద్ధి చెప్పారన్న ఆయన.. సీఎం కేసీఆర్ అనారోగ్యంగా ఉన్నానని.. మార్చిలో కొడుకు (కేటీఆర్‌)కు పట్టాభిషేకం చేయాలని ప్లాన్‌లో ఉన్నారని జోస్యం చెప్పారు. ఇక, కేంద్రం ప్రవేశపెట్టిన 3 కొత్త వ్యవసాయ  చట్టాలు రైతులకు లాభాలు చేస్తాయి తప్ప నష్టం జరగదు అన్నారు రఘునందన్ రావు.. కృత్రిమ ఉద్యమాలతో రైతులను మోసం చేయాలని చూస్తున్నారని మండిపడ్డ ఆయన… ప్రధానమంత్రి మోడీ.. రైతులకు పీఎం కిసాన్ నిధి కింద తొమ్మిది కోట్ల మంది రైతుల ఖాతాల్లో 2 వేల చొప్పున డబ్బులు జమ చేశారని గుర్తుచేశారు.. మరోవైపు.. వచ్చే 2023 ఎన్నికల్లో తెలంగాణలో కాషాయం జెండా ఎగరవస్తామని ధీమా వ్యక్తం చేశారు బీజేపీ ఎమ్మెల్యే. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts