telugu navyamedia
తెలంగాణ వార్తలు

నీ భార్యను పంపిస్తే నీ స‌మ‌స్య తీరుతుంది ..

ఉమ్మడి ఖమ్మం జిల్లా పాల్వంచలోని తూర్పు బజారులోని భార్యా పిల్లలతో ఆత్మహత్య చేసుకొన్న రామకృష్ణ కేసులో మరో ట్విస్ట్‌ బయటకొచ్చింది. తన భార్యాను కొత్తగూడెం టీఆర్ ఎస్  ఎమ్మెల్యే కొడుకు వనమా రాఘవేందర్ పంపాలని కోరాడని ఆత్మహత్యకు ముందు రామకృష్ణ సెల్పీ వీడియో ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఈ వీడియోలో వనమా రాఘవ బండారం మొత్తం బ‌య‌టపెట్టాడు. ఆ వీడియోలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవపై రామకృష్ణ తీవ్ర ఆరోపణలు చేశారు.

‘‘రాఘవ కారణంగా ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయి. కానీ ఏ భర్త కూడా వినకూడని మాటను రాఘవ అడిగారు. పిల్లలు లేకుండా నా భార్యను హైదరాబాద్‌‌కు ఒంటరిగా తీసుకురావాలని కోరారు. నీ భార్యను నా దగ్గరికి పంపిస్తే నువ్వు అడిగిన పని చేసి పెడతా.. లేకపోతే ఒక్కడు కూడా నీకు సాయం చేసేందుకు ముందుకు రాడని బెదిరించాడు.

పాల్వంచ కుటుంబం ఆత్మహత్య కేసు: కేసును విత్ డ్రా చేసుకో.. మృతుడి బావమరిదికి  బెదిరింపులు | new twist in family members suicide case in bhadradri  kothagudem

వనమా రాఘవ దురాగతాలతో ప్రజలు ఎలా బతకాలి. అతని లాంటి దుర్మార్గులను రాజకీయంగా ఎదగనివ్వొద్దు. డబ్బు రూపంలో అడిగినా ఇచ్చేవాడిని. కానీ ఏ భర్త కూడా వినగూడని మాట వనమా రాఘవ అడిగారు. నా భార్యను హైదరాబాద్ తీసుకురావాలని అడిగారు.

రాజకీయ, ఆర్ధిక బలంతో పబ్బం గడుపుకోవాలని చూశారు. వనమా రాఘవేందర్ వల్లే ఇటీవలనే పట్టణంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకొన్నాడని ఆయన గుర్తు చేశారు. ఈ కేసుతో నెల రోజుల పాటు బయటకు రాకుండా ఉన్న రాఘవేందర్ ప్రస్తుతం తనను వేధిస్తున్నాడని రామకృష్ణ ఆవేదన చెందారు.

నేను ఒక్కడినే చనిపోతే నా భార్య, పిల్లలను వదిలిపెట్టరు. అందుకే నాతో పాటు నా భార్యాపిల్లల్ని తీసుకెళ్తున్నాను. అప్పుల్లో ఉన్న నాపై నా తల్లి, సోదరి కక్ష సాధించారు. నేను వీళ్లందరితో పోరాటం చేసే స్థితిలో లేను. నా తండ్రి ద్వారా వచ్చే ఆస్తితో నా అప్పులు తీర్చాలి. నాకు సహకారం అందించిన అందరికీ న్యాయం చేయాలని , మిగిలిన ఆస్తిని తన కుటుంబ సభ్యులకు ఇవ్వాల్సిందిగా ఆ వీడియో కోరారు.

Related posts